మెరీనాబీచ్ వద్ద టెన్షన్

Update: 2017-01-23 03:18 GMT

జల్లికట్టు క్రీడకు శాశ్వత అనుమతి ఇవ్వాలని కోరుతూ చెన్నై మెరీనాబీచ్ లో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. ఆర్డినెన్స్ ఇచ్చినా దానికి శాశ్వత ప్రాతిపదిక లేదని, శాశ్వతంగా దీనికి అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు విద్యార్థులు. అయితే పోలీసులు విద్యార్థులను మెరీనా బీచ్ నుంచి ఖాళీ చేయిస్తున్నారు. ఆర్డినెన్స్ ఇచ్చినందున ఆందోళన విరమించాలని పోలీసులు కోరుతున్నారు. మెరీనా బీచ్ కు వెళ్లే రహదారులన్నింటినీ మూసివేశారు. విద్యార్థులను అదుపులోకి తీసుకుంటున్నారు. అయితే విద్యార్థులు మాత్రం దీనికి శాశ్వత పరిష్కారం కావాలంటున్నారు. దీంతో మెరీనా బీచ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది

Similar News