మార్చి 8న ఏపీ బడ్జెట్......

Update: 2017-02-09 11:09 GMT

ఏపీ రాజధాని అమరావతిలో జరుగనున్న తొలి సమావేశాలు మార్చి 3 నుంచి మొదలు కానున్నాయి. ఫిబ్రవరి చివరి వారంలో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభించి మార్చి 1న బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని భావించినా వెలగపూడిలో అసెంబ్లీ హాల్ నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో మార్చి 3 నుంచి సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు. మార్చి8వ తేదీన ఏపీ బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మార్చి 3న సమావేశాలు ప్రారంభిస్తే 8న బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు వీలవుతుందని ఆర్ధిక మంత్రి యనమల భావిస్తున్నారు. అసెంబ్లీ స్పీకర్., ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత ఈ విషయంపై తుది నిర్ణయం ప్రకటించనున్నారు.

ఈ బడ్జెట్ సమావేశాలు పెద్ద నోట్ల రద్దు తర్వాత జరగనుండటంతో కేటాయింపులు ఎలా ఉంటాయో నన్న ఉత్కంఠత నెలకొంది. దాదపు 1.50 లక్షల బడ్జెట్ ను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నట్లు తెలుస్తోంది. జలవనరులు, సంక్షేమ శాఖలకు ఈ బడ్జెట్ లో అధికనిధులు కేటాయించనున్నట్లు చెబుతున్నారు. మున్సిపల్ శాఖకు కూడా భారీగా నిధులు కేటాయించే అవకాశముంది.

Similar News