మాజీ సీఎం నల్లారిని తెగ పొగిడేసిన సీఎం నారా

Update: 2017-11-23 13:54 GMT

నల్లారి కుటుంబాన్ని నారా చంద్రబాబు నాయుడు తెగపొగిడేశారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన జరిగే సమయంలో రాష్ట్రం కలిసి ఉండేందుకు ఎంతగానో పోరాడారన్నారు. నల్లారి కుటుంబం టీడీపీలో చేరడం గౌరవంగా భావిస్తున్నామన్నారు. నల్లారి కుటుంబానికి చిత్తూరు జిల్లాలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసి ఏపీని ముందుకు తీసుకువెళ్లారన్నారు. నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి తనయుడు అమర్ నాధ్ రెడ్డి తన తాతకు తగ్గట్లు రాజకీయాల్లో ఆరితేరాలని కోరుకుంటున్నాన్నారు. అమర్ నాధ్ రెడ్డి రాజకీయ భవిష్యత్ ను తాను చూసుకుంటానని చెప్పారు. మొత్తం మీద నారా చంద్రబాబు నాయుడు కిరణ్ కుమార్ రెడ్డిని పొగిడేయడం చర్చనీయాంశంగా మారింది. కిరణ్ కుమార్ రెడ్డికూడా త్వరలో పార్టీలోకి వస్తారా? అన్న అనుమానం కలుగుతోంది.

Similar News