భూనిర్వాసితులకు నష్టమే : కోదండరామ్

Update: 2017-01-05 11:35 GMT

హైకోర్టు తీర్పును తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ స్వాగతించారు. ప్రభుత్వం జారీ చేసిన 123 నెంబరు జీవోను హైకోర్టు నిలుపుదల చేయడం పట్ల ఆయన హర్హం వ్యక్తం చేశఆరు. జీవో 123 ప్రకారం వెంటనే భూసేకరణను నిలిపేయాలని ప్రభుత్వాన్ని కోదండరామ్ డిమాండ్ చేశారు. 123 జీవో ప్రకారం భూసేకరణ జరిపితే భూ నిర్వాసితులు పెద్దయెత్తున నష్టపోయే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

2013 భూసేకరణ చట్ట ప్రకారం రాష్ట్రంలో భూములను సేకరించాల్సి ఉంటుందన్నారు కోదండరామ్. ప్రాజెక్టులకు అవసరమైన మేరకే భూములను సేకరించాలని, అలా కాకుండా ఇష్టాను సారం భూసేకరణ జరిపితే ఊర్కొనేది లేదన్నారు. 123 జీవోతో భూ నిర్వాసితులు అన్యాయమై పోతారన్న కోదండరామ్ ప్రభుత్వం కోరితే తాము ప్రత్యామ్నాయ సూచనలు చేస్తామని చెప్పారు.

Similar News