భార్యను లోబర్చుకుని... రివాల్వర్ తో భర్తను బెదిరించి

Update: 2018-02-24 02:25 GMT

పోలీసుల అక్రమ సంబంధాలు నానాటికి ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి...వివాహితలతో అక్రమ సంబంధాలు పెట్టుకుని వారి భర్తలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న తీరు ఇది. హైదరాబాద్ శివార్లలోని మంచిరేవులలో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ అమర్ గచ్చిబౌలిలోలో ఓ లేడీస్ హాస్టల్ ని నిర్వహిస్తుండేవాడు. లేడీస్ హాస్టల్లో ఉండే ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. నిలదీసిన తమను గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ అమర్ తుపాకీతో బెదిరింపులకు గురిచేస్తున్నాడని వాపోతున్నారు బాధితులు. విజయవాడకు చెందిన లక్ష్మీప్రసన్నకుమార్ కు తిరువూరుకు చెందిన యువతితో ఏడేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైనాటికి ఆమె ఇంటర్మీడియట్ వరకు చదివింది. చదువుపట్ల భార్య ఆసక్తిని గమనించిన లక్ష్మీప్రసన్నకుమార్ ఆమెని ఉన్నత చదువులు చదివించాలనే ఆశయంతో డబ్బు సంపాదన కోసం నాలుగేళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. అక్కడ సంపాదించిన డబ్బుతో తన భార్యని ఎం.ఫార్మసీ వరకు చదివించాడు. హైదరాబాద్ లో ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం రావడంతో అత్తింటి నుంచి వచ్చి... గచ్చిబౌలిలోని మనోజ్ లేడీస్ హాస్టల్లో చేరింది. ఆ లేడీస్ హాస్టల్ ని గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ అమర్ నిర్వహిస్తుండేవాడు. హాస్టల్లోని ఆ మహిళను తన మాయమాటలతో లోబర్చుకున్నాడు కీచక కానిస్టేబుల్ అమర్.

తన హాస్టల్ లోనే రూము ఇచ్చి....మద్యం అలవాటు చేసి.....

ఆమెకు మద్యం అలవాటు చేయించాడు. ప్రియుడు కానిస్టేబుల్ తో కలిసి ఫుల్లుగా మద్యంతాగేది. దుబాయ్ నుంచి తిరిగొచ్చిన భర్త లక్ష్మీప్రసన్నకుమార్ తన భార్యను తీసుకెళ్లి మరో చోట కాపురం పెట్టేందుకు ప్రయత్నించాడు. ప్రియురాలు దూరమవుతుందని భావించిన కానిస్టేబుల్ అమర్ ఆమె భర్త లక్ష్మీప్రసన్నకుమార్ కు నచ్చజెప్పి.. అదే హాస్టల్లో ఓ రూమ్ ని ఇచ్చాడు. రాత్రిళ్లల్లో ఆమె భర్త లక్ష్మీప్రసన్నకుమార్ కు మద్యం తాగించాక.. అతను మత్తులోకి జారుకున్నాక అతని భార్యతో రాసలీలలు సాగించాడు కానిస్టేబుల్ అమర్. తన భార్యతో కానిస్టేబుల్ సన్నిహితంగా ఉన్న ఫొటోలను మీడియాకు విడుదల చేశాడు భర్త లక్ష్మీప్రసన్నకుమార్. ఓ రోజు అర్థరాత్రి వేళ నిద్ర నుంచి మేల్కొని చూసేసరికి అతని భార్య పక్కన కనిపించలేదని, చూసేసరికి షాక్ తిన్నానని, లేడీస్ హాస్టల్ నిర్వాహకుడైన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ అమర్ తో అసభ్యకరస్థితిలో కనిపించిందని ప్రసన్నకుమార్ చెప్పాడు. తన భార్య, కానిస్టేబుల్ అమర్ ఇద్దరూ కలిసి రివాల్వర్ తో బెదిరింపులకు గురిచేశారని.. తన లగేజీని ఇంటి నుంచి బయటపడేశారని వాపోయాడు బాధితుడు లక్ష్మీప్రసన్నకుమార్.అంతటితో ఊరకోకుండా తన గుట్టు ఎక్కడ బయటపెడ్తాడోనన్న భయంతో భర్త లక్ష్మీప్రసన్నకుమార్ పై ఇటీవల కూకట్ పల్లి పోలీస్ స్టేషన్లో వరకట్న వేధింపుల కేసు పెట్టింది. భర్త, అత్తామామలు, మరిది కలిసి తనను వరకట్నం కోసం వేధిస్తున్నారంటూ ఉల్టా కేసు పెట్టింది ఆ మాయలేడీ. తన కోడలు, ఆమె ప్రియుడైన కానిస్టేబుల్ అమర్ నుంచి తమ ప్రాణాలకు హాని ఉందని వాపోతున్నారు బాధితులు. కీచక కానిస్టేబుల్ పై ఎస్సార్ నగర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా.. అది తమ పరిధిలోకి రాదని..కూకట్ పల్లి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు అయితే ఈ ఖాకీ బాగోతంపైన పోలీసులు సమగ్రంగా విచారణ చేస్తున్నారు.

Similar News