భార్య పై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కానిస్టేబుల్...!

Update: 2018-02-09 02:11 GMT

ఖాకీలో కాఠిన్యం పెరిగిపోతుంది. ఫ్రెండ్లీగా వుండాల్సిన పోలీసులు కఠినత్వం పెరిగి క్రూరంగా మారిపొతున్నారు. నిత్యం నేరగాళ్ల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వారి ఆలోచనలు సైతం నేరగాడి మాదిరిగానే మారిపొతున్నాయి. అందరితో ఫ్రెండ్లీగా వుండాల్సిన పోలీసుల తమ కుటుంబంలోని వారితో కూడా దారుణంగా వ్యవహరిస్తున్నారు. నేరస్థులతో వ్యవహరించినట్లుగా కుటుంబ సభ్యులతో కూడా ఖాకీలు ప్రవర్తిస్తున్న తీరు ఇది. నేరగాళ్ల పైన ఉపయోగించే ధర్డ్ డిగ్రీని సైతం కుటుంబ సభ్యుల మీద ప్రయోగిస్తున్న వైనమిది. హైదరాబాద్ లోని ఒక కానిస్టేబుల్ తన భార్యపైన ధర్డ్ డిగ్రీని ప్రయోగించిన తీరు ఇప్పడు వివాదస్పదం అవుతుంది. పది మందికి మంచి చెప్పే రక్షక భటుడు అతడు. .కాని మద్యం మహమ్మారి కి బానిసై ..ఇంట్లో ఇల్లాలి ని టార్చర్ చేశాడు..ఫ్రెండ్లీ పోలీస్ తో దూరమైన ధర్డ్ డీగ్రీ ని భార్య పై ప్రయోగించి ఆనందం పొందాడు..మిత్రులు ,కుటుంబీకులు కూడా వంత పాడడంతో సైకో లా మారి పోయాడు. తానే పోలీస్ అంటూ పోలీస్టేషన్ లోనే హడావుడి చేశాడు..భార్య ను చంపేంత పని చేస్తే..తోటి పోలీసులు కేవలం దాడి కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు.

డ్యూటీ...బార్...ఇల్లు...

సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్టేషన్ లో హెడ్ కాని స్టేబుల్ గా పని చేస్తున్నాడు సంజయ్. సంజయ్ కి పదమూడు సంవత్సరాల క్రితం సరిత తో వివాహం అయ్యింది...మోండా మార్కెట్ లో ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు..వీరికి ఓక అమ్మాయి ,ఓక అబ్బాయి సంతానం..మొదట సజావుగా సాగిన వీరి జీవితంలోకి మద్యం రక్కసి సంజయ్ ను అవహించింది..సంజయ్ కుటుంబ పోషణ మాని మిత్రులతో ఎక్కువగా గడిపేవాడు..డ్యూటీ ముగియగానే బార్..మత్తు తలకెక్కగానే ఇల్లు. ఇల్లు చేరగానే భార్యపై ధర్డ్ డిగ్రీ ప్రయోగించడమే పనిగా పెట్టుకున్నాడు..ఇలా చాలా రోజుల నుంచి ఏదో ఒక సాకుతో చితగ్గొట్టడం ..తిరిగి మత్తు దిగగానే ఏదో జరిగి పోయిందంటూ మరచిపోవడం దినచర్యగా పెట్టుకున్నాడు.

పోలీస్ స్టేషన్లోనూ...

ఇలా పలుమార్లు సరిత కుటుంబీకులు మందలించినా పట్టించుకోక పోగా..సంజయ్ కుటుంబసభ్యులు సంజయ్ కరెక్ట్ అని కితాబు ఇవ్వడంతో మరింత గా రెచ్చి పోయాడు..నిన్న మిత్రులతో కలసి ఫుల్లుగా మద్యం కోట్టిన సంజయ్..భార్య ను చంపేంత పని చేశాడు..పిల్లల బట్టలు ,స్కూల్ లో ఇబ్బందులు పట్టించుకోకుండా..కనీసం స్కూల్ వద్ద దింపకుండా ఏమి తాగుడని నిలదీయడంతో..కోపం తో ఊగిపోయిన సంజయ్..ఆమె బండరాయిని తల పై మోదే ప్రయత్నం చేశాడు..ఆమె తప్పుకోవడంతో చివరికి కాలి పై పడి గాయలయ్యాయి..ఆమె భాదతో రోదిస్తుంటూ దిక్కున చోట చేప్పుకోమంటూ తాళం వేసుకోని వెళ్ళిపోయాడు.. తను ఈ టార్చర్ భారించలేనని..తన భర్త పై కఠిన చర్యలు తీసుకోవాలని సరిత కొరింది.. పోలీస్టేషన్ లో హంగామా చేస్తూ..భార్య వైపు కోట్టేటట్లు చూస్తూ బెదిరించే ప్రయత్నం చేశాడు సంజయ్. పోలీసులు కాస్త గట్టి గా మందలించడంతో వెనక్కి తగ్గిన సంజయ్..పోలీస్ బాసులు పిలిచి నచ్చ జేప్పే ప్రయత్నం చేశారు..కాని సంజయ్ ఏం జరిగితే అది అంటూ కుటుంబసభ్యుల భరోసా తో...కేసు నమోదు చేసుకో మంటూ పోలీస్ ల కౌన్సిలింగ్ లో తేల్చిచేప్పాడు..తోటి పోలీస్ లు నచ్చ జేప్పిన వెనక్కి తగ్గపోవడంతో..పాటు..సరిత తరుపు బంధువులు కూడా కేసు నమోదు చేయలని పట్టుబట్టడంతో..324 క్రింద చిన్న కేసు నమోదు చేశారు పోలీసులు.

Similar News