భారీ ప్యాకేజీ స్థాయిలో అడిగిన కేటీఆర్

Update: 2016-09-29 22:18 GMT

హైదరాబాదు నగరాన్ని కొన్ని రోజుల పాటు అతలాకుతలం చేసిన వర్షాలు ఒకింత తగ్గుముఖం పట్టాయో లేదో.. అప్పుడే పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఢిల్లీలో ప్రత్యక్షం అయ్యారు. నగరాన్ని బాగు చేయడానికి కేంద్రం నుంచి ఇతోధికంగా నిధులు రాబట్టడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. ఆయన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును గురువారం సాయంత్రం కలిసి.. హైదరాబాదు నగరం కోసం నిధులు కావాల్సిందిగా అడిగారు. కేటీఆర్ ఏకంగా 1189 కోట్ల రూపాయలు అడగడం విశేషం.

ఒకవైపు కొత్త రాజధాని అమరావతి నిర్మాణానికి అంతగా నిధులు రావడం లేదు మొర్రో అని బాధపడుతోంటే.. విశ్వనగరంగా వైభవంగా ఉన్న నగరం రిపేర్లకే అంత భారీ స్థాయిలో నిదులు అడగడం చోద్యమే మరి. హైదరాబాదు నగరం వర్షాలకు భారీగానే దెబ్బతిన్న మాట వాస్తవం. కానీ అందువల్ల కేంద్రం నుంచి దాదాపు 1200 కోట్ల ప్యాకేజీ కి ఆశలు పెట్టుకోవడం అనేది పొంతన కుదరని సంగతి లాగా కనిపిస్తోంది.

Similar News