బ్రేకింగ్ : లోక్ సభలో అదే సీన్...మంగళవారానికి వాయిదా

Update: 2018-03-23 06:41 GMT

లోక్ సభ మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి ప్రారంభం అయిన వెంటనే తిరిగి ఆందోళనలు ప్రారంభమయ్యాయి. వియ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు మిన్నంటాయి. సభ్యుల నినాదాల మధ్యనే స్పీకర్ సుమిత్రా మహాజన్ కొన్ని ప్రకటనలు చేశారు. కొన్ని కమిటీలను నియమిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. వైసీపీ, టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను చదివి విన్పించారు. సభ్యులు ప్రశాంతంగా ఉండాలని పదే పదే కోరారు. అన్నాడీఎంకే, టీఆర్ఎస్ లు తమ డిమాండ్లను అంగీకరించాలని కోరుతూ ఆందోళనలు కొనసాగించాయి. పోడియంను చుట్టుముట్టి ప్లకార్డులతో నినాదాలు చేశారు. సభ ఆర్డర్ లో లేకపోవడంతో తాను హెడ్ కౌంట్ చేయలేనని చెప్పారు. తనకు సభ్యులను లెక్కించడానికి సాధ్యపడటం లేదన్నారు. సభను స్పీకర్ సుమిత్రా మహాజన్ మంగళవారానికి వాయిదా వేశారు.

Similar News