బీజేపీకి వ్యతిరేకంగా శివసేన ఏం చేసిందంటే?

Update: 2017-06-07 18:29 GMT

మహారాష్ట్రలో రైతులు చేస్తున్న నిరసనకు శివసేన మద్దతు తెలిపింది. విన్నూత్న తరహాలో నిరసన తెలిపింది. మహారాష్ట్రలో గత కొద్ది రోజులుగా రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. రైతులకు రుణమాఫీచేయాలని, పంటలకు సరైన గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ నిరసన చేస్తున్నారు. రోడ్ల మీద తాము పండించిన ఉత్పత్తులు పారబోసి నిరసన తెలిపారు. పాలు, కూరగాయలను హోల్ సేల్ మార్కెట్ కు తీసుకురావడం రైతులు బంద్ చేయడంతో మహారాష్ట్రలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. పాలు, కూరగాయలు దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా స్పందించారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా ప్రకటించారు.

గుండు కొట్టించుకుని నిరసన.....

అయితే రైతులు రైతులు రుణమాఫీతో పాటు ఉచిత విద్యుత్తును కూడా డిమాండ్ చేస్తున్నారు. రైతుల డిమాండ్లను ప్రభుత్వం పరిశీలిస్తుందని ముఖ్యమంత్రి ఫడ్నవిస్ చెప్పారు. అయితే రైతులకు అండగా శివసేన పార్టీ ముందుకొచ్చింది. రైతుల ఆందోళనల్లో శివసేన పాల్గొనడంతో ఉద్యమం మరింత ఉథృతమైంది. బుధవారం శివసేన మహిళ కార్యకర్తలు రైతులకు మద్దతుగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా విన్నూత్న నిరసనలు తెలియజేశారు. శివసేన మహిళ కార్యకర్తలు గుండు కొట్టించుకుని, తెల్లటి వస్త్రాలు ధరించి నిరసనలు తెలియజేశారు. మహారాష్ట్రలోని బీడీ జిల్లాలో శివసేన కార్యకర్తలు శిరోముండనం చేయించుకున్నారు.

Similar News