బాబుపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

Update: 2018-02-09 14:16 GMT

రాజ్యసభ ఎన్నికలను హైదరాబాద్ లోనే జరపాలని వైసీపీ కేంద్ర ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేసింది. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లోనే రాజ్యసభ ఎన్నికలను నిర్వహించాలని కోరింది. ఇప్పటికే తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను అధికార టీడీపీ కొనుగోలు చేసిందని, విజయవాడలోనే ఎన్నికలు జరిపితే తిరిగి ఎమ్మెల్యేల కొనుగోళ్లకు తెరలేపే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ రావత్ ను కలిశారు. ఎమ్మెల్యేలపై కేసులు పెట్టి అక్కడి ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తుందని, ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టి ఎన్నికలకు రాకుండా చేయాలని భావిస్తోందని విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా ఉండాలంటే హైదరాబాద్ లోనే ఎన్నికలు జరగాలని, వైసీపీ ఎమ్మెల్యేలకు భద్రత కల్పించాలని విజయసాయి రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Similar News