పోలవరం పనులు మూడొంతుల పూర్తి

Update: 2017-07-19 02:33 GMT

పోలవరం ప్రాజెక్టులో మూడొంతుల పని పూర్తైందని కేంద్ర జలవనరుల శాఖ రాజ్యసభలో ప్రకటించింది. కాంగ్రెస్‌ఎంపీ రేణుకా చౌదరి అడిగిన ప్రశ్నకు ఆ శాఖ సహాయమంత్రి సంజీవ్‌ కుమార్‌ బాల్యన్‌ ప్రత్యుత్తరమిచ్చారు. 2009-10 మధ్య కాలంలో ఏఐబీపీ ప్రాజెక్టుల కింద రూ.56.47 కోట్లు కేంద్రం ఇచ్చిందని తెలిపారు. ఏపీ పునర్విభజన చట్టంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత భూసేకరణ., సహాయ, పునరావాస కార్యక్రమాలతో పాటు ప్రాజెక్టు నిర్మాణానికి రూ.3,364కోట్లను ఇప్పటి వరకు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతంగా చేసేందుకు డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానల్‌ను కేంద్రం ఏర్పాటు చేసిందని., ఈ ప్యానల్్ ఇప్పటి వరకు ఏడుసార్లు సమావేశమైందన్నారు. క్షేత్రస్థాయిలో ప్రాజెక్టును ఒకసారి పరిశీలించారని., ప్రాజెక్టు పనులు సున్నితంగా వేగంగా జరగడానికి కమిటీ పలు సూచనలు చేసిందని వివరించారు. 2017 మే నాటికి పోలవరంలో మట్టిపని 66శాతం, కరకట్ట పనులు 9 శాతం., నేవిగేషన్‌ టన్నెల్‌., ఓటీ రెగ్యులేటర్ కాంక్రీట్‌ 6శాతం., 30గేట్ల ఏర్పాటు పూర్తైంది. కుడికాల్వ మట్టిపని 100శాతం పూర్తైంది., లైనింగ్‌ 79శాతం చేశారు. నిర్మాణాలు 61శాతం పూర్తయ్యాయి. ఎడమ కాల్వ మట్టిపని 86శాతం., లైనింగ్‌ 62 శాతం., నిర్మాణం 24శాతం పూర్తైంది.

Similar News