పిల్లలను నిద్రపోనివ్వారా? : కేటీఆర్ కు ట్వీట్

Update: 2017-01-22 08:48 GMT

పిల్లలను చదువు కోసం వారి బాల్యాన్ని చిదిమేస్తున్నారా? అవుననే అంటున్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ఓ పిల్లాడు తన జేబులో ఒక చపాతితో ఉదయం పాఠశాలలో జరిగే ప్రార్దన సమయంలో నిద్రముంచుకొచ్చి తూలుతూ నిల్చొన్న ఫొటోను ఒక నెటిజన్ ట్వీట్ చేశారు. దీనికి మంత్రి కేటీఆర్ స్పందించారు. స్కూలు సమయాలను మార్చాల్సిన అవసరముందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. పిల్లలు తమ బాల్యాన్ని కోల్పోతున్నరన్నారు. ఆడుకోవాల్సన వయసులో పుస్తకాల బారిన పడి తమ ఊహాశక్తి కోల్పోతున్నారన్నారు. ఉదయాన్నేనిద్రలేచి స్కూలు కెళ్లడంతో చిన్నారులకు నిద్ర కూడా కరవైందన్నారు.

పాఠశాలల టైమింగ్స్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. ఉదయం 6గంటల నుంచే స్కూలుకు వెళ్లేందుకు పిల్లలు పడుతున్న శ్రమను గుర్తించి ఇప్పటికైనా ప్రభుత్వం పాఠశాలల వేళల్లో మార్పులు చేయాలని నెటిజన్లు కోరుతున్నారు. ఉదయం పదిగంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ పాఠశాలల టైమింగ్స్ మారిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు

Similar News