పళనిస్వామిపై పన్నీర్ ఆరోపణలు

Update: 2017-02-14 14:23 GMT

పన్నీర్ సెల్వం తన ప్రత్యర్థిపై ఆరోపణలు గుప్పించారు. శాసనసభాపక్ష నేతగా పళనిస్వామిపై పన్నీర్ వర్గం ఆరోపణలు చేస్తోంది. ఆయనకు ఇసుక మాఫియా నేత శేఖర్ రెడ్డికి సంబంధాలున్నట్లు పన్నీర్ వర్గం ఆరోపిస్తోంది. మాజీ టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డిపై గత కొంతకాలం క్రితం ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసిన సంగతి తెలిసిందే. పళని స్వామి ఇసుక కాంట్రాక్టు మంజూరులో అనేక అక్రమాలకు పాల్పడ్డారని పన్నీర్ ఆరోపిస్తున్నార. పళనిస్వామి వియ్యంకుడు రామలింగంతో మాజీ టీటీడీ సభ్యుడు శేఖర్ రెడ్డితో సంబంధాలున్నట్లు ఆరోపిస్తున్నారు.

ఎమ్మెల్యేలను బెదిరించి సంతకాలు పెట్టించిందని చెబుతున్నారు. శాసనసభ పక్ష నేత ఎన్నిక సరిగా జరగలేదని పన్నీర్ వర్గం వాదిస్తోంది. దీంతో మరోసారి తమిళ రాజకీయాలు హీటెక్కాయి. ఈ ఆరోపణలన్నింటినీ పన్నీర్ వర్గం గవర్నర్ దృష్టికి తీసుకెళ్లే యోచనలో ఉంది. మొత్తం మీద తమిళ రాజకీయాలు అంత త్వరగా తెగేట్టు లేవు.

Similar News