పరుగులు తీయనున్న పోలవరం పనులు

Update: 2016-12-26 08:53 GMT

పోలవరం ప్రాజెక్టులో కీలక ముందడగు పడింది. నాబార్డు 1900 కోట్ల రుణాన్ని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం నిధులను విడుదల చేసింది. ఈ చెక్కును ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రమంత్రి ఉమాభారతి చేతులు మీదుగా అందుకోనున్నారు. నిధులు విడుదల అయినందున పోలవరం ప్రాజెక్టు పనులు ఇక వేగవంతం కానున్నాయి. ముఖ్యంగా నిర్వాసితులకు పరిహారం చెల్లించనున్నారు. ఎకరాకు పదిన్నర లక్షల పరిహారం ప్రభుత్వం ఇవ్వనుంది. ప్రాజెక్టు పనులను త్వరితగతంగా పూర్తి చేసే వీలుంది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుపై ప్రతి సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాజెక్టు పురోగతిని సమీక్షిస్తున్నారు. ఈ నెల 30 వ తేదీన కాంక్రీటు పనులు ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పోలవరాన్ని 2018లోగా పూర్తి చేస్తామని చంద్రబాబు పదపదే చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో నాబార్డు నుంచి నిధులు విడుదల కావడంతో ప్రభుత్వ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

Similar News