నెత్తురోడిన పాక్...130 మంది మృతి

Update: 2018-07-14 02:01 GMT

పాకిస్థాన్ నెత్తురోడింది. ఉగ్రవాదులు పేట్రేగిపోవడంతో దాదాపు 130 మందికి పైగా మరణించారని తెలుస్తోంది. ఈ నెల 25వ తేదీన పాకిస్తాన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా జరిగిన ఎన్నికల ర్యాలీలో మానవబాంబు పేలడంతో 130 మంది అక్కడికక్కడే మృతి చెందారు. వందల సంఖ్యలో గాయపడ్డారు. బలూచిస్థాన్ అవామీ పార్టీ బలూచిస్థాన్ రాష్ట్రంలోని మస్తంగ్ లో ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో ఈ మానవబాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ఆ పార్టీ అభ్యర్థి సిరాజ్ రైసానీ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దాడికి ఇస్లామిక స్టేట్ ఉగ్రవాదులే కారణమని తెలుస్తోంది. బాంబు దాడిలో మృతి చెందిన సిరాజ్ బలూచిస్థాన్ మాజీ ముఖ్యమంత్రి నవాబ్ అస్లామ్ రైసానీకి సోదరుడు. ఎన్నికల వేళ పాకిస్థాన్ మరోసారి రక్తసిక్తమయింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమయింది.

Similar News