నిర్వేదంలో ఎంపీ రాయపాటి

Update: 2017-07-17 08:27 GMT

టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నిర్వేదంలోకి వెళ్లిపోయారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పదవిని తాను ఇక అడగదలచుకోలేదని, ఎవరికి ఇస్తారో కూడా తనకు తెలియదని రాయపాటి చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆ పదవి అడగొద్దని చంద్రబాబు ఎప్పుడో చెప్పారని, అందుకే ఇక అడగటం అనవసరమనుకున్నానన్నారు. టీటీడీ ఛైర్మన్ పదవి దక్కినా సంతోషమే...దక్కకున్నా సంతోషమేనని రాయపాటి చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతిచ్చినంత మాత్రాన ప్రధాని మోడీ జగన్ ను కేసుల నుంచి బయటపడేయరని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అది జగన్ పొరపాటుగా ఊహించుకుంటున్నారన్నారు. ఏపీ నుంచి ఒక్క ఓటు కూడా యూపీఏ అభ్యర్థి మీరా కుమార్ కు పడలేదని రాయపాటి చెప్పారు.

Similar News