నగదు రహిత దేశం గా ముందడుగు

Update: 2016-12-14 16:00 GMT

కేంద్రం చేపట్టిన పెద్ద నోట్ల రద్దు చర్యకు తొలుత కేంద్ర ప్రభుత్వం పంపిన సంకేతాల ప్రకారం దీర్ఘకాలిక ప్రయోజనాలు స్వీకరించటానికి స్వల్ప కాల ఇబ్బందులు ఎదుర్కొనటానికే సగటు సామాన్యుడు సిద్దపడ్డప్పటికీ ఈ స్వల్ప కాళికా ఇబ్బంది నెమ్మదిగా కరెన్సీ కష్టంగా మారి చిరు వ్యాపారాలు, చిన్న ఉద్యోగుల జేబుకి గండి కొట్టటం, ప్రతిపక్షాలు పెద్ద చేపలకు గాలం వేయలేక సామాన్యుడిపై జులుం విధించింది అనే ఎదురుదాడి మొదలు పెట్టటంతో ప్రజలలో కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నిర్ణయంపై నిరసన భావం పెరుగుతూ వచ్చింది. కాష్ లెస్ లావాదేవీలకు ఇదే తరుణం అంటూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు పదే పదే పిలుపు ఇస్తున్నప్పటికీ బ్యాంకుల సర్వర్లు మొరాయించడంతో కార్డు వినియోగదారుడికి కూడా అష్ట కష్టాలు ఎదురు అవుతున్నాయి.

దీనితో పెద్ద నోట్ల రద్దు చర్య పూర్తిగా విఫలం ఐయిందనుకునే తరుణంలో నోట్ల మార్పిడి చేసిన పలువురు ప్రముఖ పారిశ్రామిక వెతలను, ప్రభుత్వ దేవస్థాన సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్న ఆదాయపన్ను శాఖ వారి దూకుడికి ప్రజలలో మళ్లీ చర్చ మొదలైయింది. బిగ్ షాట్స్ ని కూడా ప్రభుత్వం సహించదు అనే సంకేతాలు కొద్దిగా సామాన్యుడి దిశగా వెళ్లటంతో మెల్లగా కాష్ లెస్ లావాదేవీలకు అలవాటు పడుతున్నారు సామాన్య ప్రజలు. ఈ సంఖ్యా మరింతగా పెంచటానికి పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరకుల కొనుగోలుకు కార్డు ద్వారా సొమ్ము చెల్లించిన వారికి బిల్ లో ౦.75 శాతం రాయితీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించటంతో ఏటీఎం ల వద్ద నోట్ల కోసం నిలబడే వారి సంఖ్యా అనూహ్యంగా తగ్గింది. కార్డు ట్రాన్సక్షన్స్ చేసే వారి సంఖ్యా నానాటికి పెరుగుతుంది అని ఒక ప్రముఖ ఛానల్ సర్వే వెల్లడించటం గమనార్హం.

ప్రస్తుతం ప్రపంచంలో అధిక శాతం నగదు రహిత లావాదేవీలు జరిపే దేశాలకు కూడా ఈ తంతు ఒక్క రాత్రిలో ముగియలేదు అని కొంత సమయం పడుతుంది అని, ఇంకా సాంకేతికతను జీవన శైలి లో అన్వయించుకొని ప్రజలు ఎక్కువ వున్నా భారత దేశంలో ఇప్పటి వరకు సాధించిన ఈ ఘనత కూడా అనితర సాధ్యమని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ మరొక సారి మీడియా ముఖంగా గుర్తు చేశారు.

Similar News