నంద్యాల ఎన్నికకు 13మంది టీడీపీ బాధ్యులు వీరే

Update: 2017-07-28 13:47 GMT

నంద్యాల ఉప ఎన్నిక కోసం 18 మంది క్లస్టర్ ఇన్ ఛార్జు లను నియమిస్తూ పార్టీ కేంద్రకార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు నంద్యాల తెలుగుదేశం కార్యాలయానికి అందాయి. స్థానిక పరిస్థితులను అధ్యయనం చేసి స్థానిక నాయకులను సమన్వయం చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపుకు కృషి చేసే బాధ్యత వారికి అప్పగించారు. క్లస్టర్ ఇంచార్జ్ లుగా నియమితులైన వారిలో శాసనసభ్యులు,పార్టీ ముఖ్యనాయకులు తదితరులున్నారు నంద్యాల ఉపఎన్నికకు క్లస్టర్ ఇంచార్జ్ లుగా నియమితులైన వారిలో ఎమ్మెల్యేలు తోట త్రిముర్తులు , వర్మ, జ్యోతుల నెహ్రూ, రామకృష్ణారెడ్డి, ఉమ, బండారు సత్యానారాయణ, గణబాబు, ప్రభాకర్ చౌదరి, బోడె ప్రసాద్, జితేందర్ గౌడ్, కొండబాబు, కూనరవి కుమార్, కలమట వెంకటరమణ, మేడా మల్లికార్జునరెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, ఏలూరి సాంబశివరావు, ఆలపాటి రాజా ఉన్నారు. 13 పోలింగ్‌ కేంద్రాల బాధ్యతలను 13మందికి అప్పగించారు. నంద్యాల ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోను భూమాను గెలిపించాలనే ఉద్దేశంతో చంద్రబాబు అన్ని అస్త్రాలు ప్రయోగిస్తున్నారు.

Similar News