తెలంగాణ స్వర్గధామం: గవర్నర్

Update: 2018-03-12 06:04 GMT

పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామమని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. టీఎస్ ఐపాస్ తో పదిహేను రోజుల్లో పరిశ్రమలకు ఇస్తున్నట్లు గవర్నర్ వెల్లడించారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఐటీ పరిశ్రమలన్నీ హైదరాబాద్ లో కేంద్రీకృతమయ్యాయని తెలిపారు. ప్రస్తుతం టీ హబ్ తో స్టార్ట్ అప్ పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని, త్వరలోనే టీహబ్ -2 కూడా ప్రారంభించనున్నట్లు గవర్నర్ తెలిపారు. అలాగే తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందన్నారు. రైతులకు అవసరమైన విత్తనాలను, ఎరువుల పంపిణీని చేస్తునా్నమని చెప్పారు.

రైతు ప్రభుత్వం....

రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామనిచెప్పారు. వ్యవసాయం తో పాటు దాని అనుబంధ రంగాలను కూడా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. అందుకు గొర్రెల పంపిణీ కార్యక్రమమే ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. గొల్లకురుమలకు 75 శాతం సబ్సిడీతో గొర్రెలను పంపిణీ చేస్తున్నమని, దీని వల్ల పెంపకందారులతో పాటు రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుందన్నారు. విద్యుత్తు రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించామన్న గవర్నర్, రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్తును అందజేస్తున్నామని చెప్పారు. కేసీఆర్ కిట్లకు అనూహ్య స్పందన లభిస్తుందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

Similar News