జగన్ ఎందుకు మొహం చాటేస్తున్నావ్?

Update: 2017-07-25 11:54 GMT

ఒక ప్రముఖ ఛానల్ లో పనిచేసిన మాజీ విలేకరితో కోర్టు కేసులు ఎందుకు వేయిస్తున్నారో ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేసారు. మంగళవారం ఆయన తెదేపా రాష్ట్ర కార్యాలయలం గుంటూరులో మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉమ మాట్లాడూతూ, పట్టిసీమపై కోర్టు కేసులు వేసారని, గోదావరి జిల్లాలకు వెళ్ళి రైతులను రెచ్చగొట్టి దేవినేని ఉమ నీళ్లు ఎత్తుకెళుతున్నాడని నా బొమ్మలు తగులబెట్టారన్నారు. ఇవాళ 20 టీఎంసీ గోదావరి జలాలు వచ్చాయని వాటికి జగన్ ఏం సమాధానం చెప్తారని అన్నారు. పట్టిసీమ, పోలవరం పై నేను అడిగే ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పడం లేదని మంత్రి ఉమ ప్రశ్నించారు. రెండు రోజులు అమరావతిలో ప్లీనరీ సమావేశాలు నిర్వహించి 673 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని వారి కుటుంబ సభ్యులను తిట్టారని అన్నారు. ప్రకాశం బ్యారేజిలో బ్రహ్మండంగా గోదావరి తల్లి కృష్ణాడెల్టా కాలువల ద్వారా ప్రవహిస్తుంటే రైతులు పెద్ద ఎత్తున పొలం పనుల్లో భాగస్వాములై పండుగలు చేసుకుంటున్నారన్నారు. జగన్ రెండుసార్లు ప్రకాశం బ్యారేజి మీదుగా వెళ్లి వచ్చారని ఆ సమయంలో గోదావరి జలాలు కనబడలేదా ? అని అన్నారు. ఎందుకు మోహం చాటేస్తున్నావ్... అని మంత్రి ఉమా ప్రశ్నించారు.

Similar News