చిన్నమ్మకు శాసన సభ్యుల మద్దతు

Update: 2016-12-18 06:46 GMT

తమిళనాడు రాష్ట్రంలో దశాబ్దాలుగా ఏ.ఐ.ఏ.డి.ఎం.కె పార్టీ కి దిశా నిర్దేశం చేస్తూ పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయ పరుస్తూ పాలించిన ముఖ్య మంత్రి జయలలిత మరణానంతరం తమిళనాడు రాష్ట్రంలో అనిశ్చితి కొన్ని రోజులుగా కొనసాగుతోంది. తొలి నాళ్ళ నుంచి జయలలిత ప్రాణ స్నేహితురాలు, శ్రేయోభిలాషిగా తుది వరకు నిలిచిన శశికళకే పార్టీ అధ్యక్షత పదవి కట్టపెడతారని స్పష్టత వచ్చినప్పటికీ, జయలలిత కుటుంబ సభ్యులు అమ్మ మరణం పై శశికళ ప్రమేయం వుందని చేసిన తీవ్ర ఆరోపణలు కొత్త అలజడులు సృష్టించాయి. ఈ తరుణంలో అమ్మ స్థానాన్ని చిన్నమ్మ భర్తీ చేయటానికి తమిళ తమ్ముళ్లు అంగీకరిస్తారా అనే మీమాంస ఏర్పడింది.

తమిళనాడు రాష్ట్రంలో మొత్తం 235 శాసన సభ స్థానాలు ఉండగా వాటిల్లో జయలలిత మరణంతో ఒక నియోజకవర్గానికి ప్రస్తుతం శాసన సభ తరపున ప్రజా ప్రతినిధి ఎవరూ లేరు. ఇక మిగిలిన 234 స్థానాల్లో 135 స్థానాలలో అధికార పార్టీ కి చెందిన శాసన సభ్యులే వున్నారు. వీరిలో కేవలం ఐదుగురు శాసన సభ్యులు మాత్రమే శశికళ అధ్యక్ష పదవి చేపట్టటం పై విముఖత ప్రకటించగా మిగిలిన 130 మంది శాసన సభ్యులు శశికళ నేతృత్వంలో పని చేయటానికి తమ పూర్తి మద్దతు ప్రకటించారు. దీనితో శశికళ తిరుగులేకుండా తమిళనాట చిన్నమ్మగా అధికార పార్టీ అధ్యక్ష పదవి పగ్గాలు చేపట్టడానికి సర్వం సిద్ధం ఐయ్యింది.

Similar News