చంద్రబాబుకు విముక్తి ; ఆళ్ల, ఉండవల్లి లకు అక్షింతలు

Update: 2016-12-09 08:59 GMT

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రను తేల్చాలంటూ దాఖలైన పిటిషన్ లు తెలిపోయాయి. ఇందుకోసం దాఖలు అయిన పిటిషన్ లను హై కోర్ట్ కొట్టి వేసింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్ర గురించి విచారణ జరపాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొన్నది. ఈ కేసుకు సంబంధించి బాధితులు ఎవరికీ లేని శ్రద్ద మీకు ఎందుకంటూ పిటిషన్ దారులను న్యాయస్థానం ప్రశ్నించింది.

హై కోర్టు లో కేసు వేసినప్పటి నుంచి చంద్రబాబు కు శిక్ష పడిపోయినట్లే.. అయన నిందితుడు అని తెలిపోయినట్లే.. పదే పదే ప్రచారం చేసుకుంటూ ఉన్న వైసీపీ నాయకులకు ఇది చేదు తీర్పు.

తొలుత సిబిఐ కోర్టులో కేసు వేసిన అళ్ల రామకృష్ణా రెడ్డి దీనిని ఒక పట్టాన విడిచి పెట్టలేదు. సిబిఐ కోర్టు తీర్పుపై చంద్రబాబు హై కోర్టును ఆశ్రయించినప్పుడు, అళ్ల సుప్రీం కు వెళ్లారు అక్కడినుంచి ఆదేశాలు తెచ్చారు.

ఈలోగా మరో ట్విస్ట్ కూడా జరిగింది. ప్రజా ప్రయోజనం తో ముడిపడిన ఈ కేసులో తనను కూడా జత చేసుకోవాలంటూ.. ఉండవల్లి అరుణ్ కుమార్ రంగంలోకి వచ్చారు. తీరా శుక్రవారం వీటిని విచారించిన కోర్టు చంద్రబాబు పాత్రపై విచారణే అక్కర్లేదని తేల్చింది. ఈ తీర్పు తెలుగుదేశం నాయకులకు గొప్ప నైతిక మద్దతు కాగా, వైసీపీ మాత్రం తాము సుప్రీం కోర్టును ఆశ్రయించి అయినా చంద్రబాబు నేరాన్ని బట్టబయలు చేస్తామని బింకంగా చెప్పవచ్చు.

Similar News