చంద్రబాబు కూడా అండర్ టేకింగ్ ఇచ్చారుట

Update: 2016-11-21 14:45 GMT

రాష్ట్రంలో ప్రదర్శనలు ఉద్యమాలు ఏవీ జరగడానికి వీలు లేకుండా సెక్షన్ 30 నిరవధికంగా అమల్లో ఉన్నట్లు డీజీపీ చెప్పినప్పటి నుంచి రాష్ట్రంలో పరిస్థితి భిన్నంగా ఉంది. విపక్షాలు. ఏ చిన్న సభలు ప్రదర్శనలు ప్లాన్ చేస్తున్నా... పోలీసులు అనుమతి లేదంటూ అడ్డుపడడం జరుగుతోంది. తమ కార్యక్రమంలో ఎలాంటి అల్లర్లు జరగవు అని నాయకులు అండర్ టేకింగ్ ఇవ్వాలని పోలీసులు అడుగుతున్నారు. సీఎం అయిన ఇవ్వాల్సిందేనని చెబుతున్నారుట. తూగో జిల్లాలో మంగళవారం జగన్ కార్యక్రమానికి ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతున్నాయి.

సెక్షన్ 30 పేరు మీద అండర్ టేకింగ్ తప్పదంటున్న పోలీసుల వైఖరి ప్రస్నార్ధకం అవుతోంది. వైసీపీ నేతలు మాత్రం నిరసనలు ఏమి లేవని జగన్ కేవలం ముఖాముఖి లో పాల్గొంటారని చెబుతున్నారుట. అల్లర్లు జరగవు అని హామీ మాత్రం ఇవ్వడం లేదు.

సెక్షన్ 30 గురించి తెలుగుపోస్టు ఇదివరకే ఒక కథనం అందించింది. అప్రకటిత ఎమర్జెన్సీ లాంటి ఈ చర్యలతో విపక్షాల నిరసనల్ని తొక్కేయగలరు గానీ, వారిలో అసహనం మాత్రం విపరీతంగా పెరుగుతోంది.

Similar News