కోర్టుకు మంత్రి కేటీఆర్

Update: 2017-07-26 09:56 GMT

తెలంగాణ ఉద్యమ సమయంలో రైళ్ళ రాకపోకలకు ఆటంకం కలిగించిన కేసు విచారణకు తెలంగాణ మంత్రులు కేటీఆర్‌., నాయిని నర్సింహరెడ్డి., పద్మారావులు సికింద్రబాద్‌ రైల్వే కోర్టుకు హాజరయ్యారు. కేసు విచారణకు సాక్ష్యులు హాజరుకాకపోవడంతో ఆగష్టు 21కు వాయిదా వేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 2011లో నిర్వహించిన ఆందోళనల్లో భాగంగా మౌలాలి రైల్వే స్టేషన్‌లో రైల్‌ రోకో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కేసులో 14మందిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. సాక్ష్యులు విచారణకు రాకుంటే కేసును కొట్టివేస్తామని న్యాయమూర్తి తెలిపినట్లు తెలంగాణ హోంమంత్రి నాయిని చెప్పారు.

Similar News