కేవలం సెల్ఫీ కోసం పరిగెట్టిన హీరోయిన్!

Update: 2016-10-02 07:19 GMT

ఒకప్పుడు నమిత అంటే తెలుగు, తమిళం లో కుర్ర కారుకి పిచ్చ క్రేజ్ ఉండేది. అయితే ఆమె తమిళులకు లడ్డులా ఉంటే ఇష్టమని క్రమేణా తన బాడీ షేప్ ని పెంచేసింది. అయినా కూడా నమిత కున్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏమాత్రం తగ్గదనడంలో అతిశయోక్తి లేదేమో! ప్రస్తుతం ఈమె అధికంగా తెరపై కనిపించకపోయినా సినీ జనాలేకాదు సాధారణ ప్రజల్లోనూ ఆమె క్రేజే ఏమాత్రం తగ్గడంలేదు. ఏ కొత్త షాప్‌ ఓపెనింగ్‌ కి వెళ్లినా ఆమె చుట్టూ జరుగుతున్న తొక్కిసలాటలే ఇందుకు నిదర్శనంగా చెప్పుకొవచ్చు. చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్టు... ఈ ముద్దుగుమ్మ ఎంత బొద్దుగున్నా అభిమానులకు ముద్దే!!

అయితే తాజాగా మరోసారి నమిత ఒక సెల్ఫీ కోసం వార్తల్లో నిలిచింది నమిత. తాజాగా నమిత నెల్సన్‌ మాణిక్యం రోడ్డులో తన కారులో ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో అటుగా ఒక ఆటో వెళ్తుంది. ఆ ఆటోని ఆ ఆటోడ్రైవర్‌ ని చూసిన నమిత తెగ ఆనందపడిపోయారట. కారణం... ఒక మహిళ ఆ ఆటో నడుపుకుంటూ రావడం నమిత కంటపడటమేనంట. దీంతో వెంటనే తన కారు ఆపి కిందకు దిగిన నమిత ఆటో వెనకాలే పరిగెత్తి మరీ ఆమెతో ఒక సెల్ఫీ కోసం ప్రయత్నించింది నేరుగా ఆ మహిళా ఆటోడ్రైవర్ను కలిసి ఆమెతో టక్కున సెల్ఫీలు తీసుకుంది. ఈ ఊహించని పరిణామంతో షాక్‌ కి గురై అనంతరం తెరుకున్న ఆ మహిళా నేను ఒక ఆటో డ్రైవర్ ని మీరు నాతో ఫోటో దిగడం అన్నది నిజమేనా లేక కలా? అని నమితను అడిగింది. ఆ ప్రశ్నపై స్పందించిన నమిత... జీవితంలో నమ్మశక్యం కానిదేదీ లేదనీ నమ్మకమే జీవితం అని చెప్పిందట. అయితే.. ఆ మహిళ పేరు ధనలక్ష్మీ అని తెలుసుకున్న నమిత కుటుంబ పోషణ కోసం ధైర్యంగా ఆటో నడుపుతున్నందుకు ఆమెకు సెల్యూట్‌ చేసి అక్కడ నుంచి బయలు దేరారు. ఇదండీ విషయం.

Similar News