కేటీఆర్ బాస్...కేసీఆర్ బిగ్ బాస్

Update: 2017-01-06 16:00 GMT

అసెంబ్లీ లాబీల్లో ఇవాళ పార్లమెంటు సభ్యుడు బాల్క సుమన్, టీడీపీ నేత రేవంతరెడ్డి మధ్య రసవత్తరమైన సంభాషణ నడిచింది. అసెంబ్లీ లాబీల్లో ఒకరికొకరు ఎదురుపడి విష్ చేసుకున్నారు. ఏంటి ఇలా వచ్చావ్? అని సుమన్ ను రేవంత్ రెడ్డిని అడగ్గా...బాస్ ను కలిసేందుకు వచ్చానని సుమన్ సమాధానమిచ్చారు. ఇంతకీ నీకు బాస్ ఎవరని రేవంత్ రెడ్డి అడిగారు. అందుకు సుమన్ నాకు బాస్ కేటీఆర్.....బిగ్ బాస్ కేసీఆర్ అని చెప్పారు. అయితే హరీశ్ నీకు బాస్ కాదా? అని రేవంత్ తిరిగి ప్రశ్నించారు. హరీశ్ కూడా బాసే అని సుమన్ చెబుతుండగా....షరతులు వర్తిస్తాయి అని నువ్వు చెబుతున్నట్లు వుంది అని రేవంత్ చమత్కరించారు.

బాల్కసుమన్ పై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు టీడీపీ ఇచ్చింది. ఈ విషయపై రేవంత్ ను మీడియా ప్రతినిధులు సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఏమైందని అడిగారు. సుమన్ మేనేజ్ చేసుకుని ఉంటాడని రేవంత్ నవ్వుతూ చెప్పారు. ఈ రాష్ట్రంలో మేనేజ్ మెంట్ స్కిల్స్ ఎక్కువ ఉన్నది రేవంత్ కేనని సుమన్ తిరిగి చమత్కరించారు. విలేకర్లు కూడా ఇప్పడు కేసీఆర్ కు జానారెడ్డితో పాటు రేవంత్ కూడా మిత్రుడయినట్లుందే అని అనగా....నవ్వుతూ ఇప్పుడు మేం మిత్రులమయ్యాం....మీ సంగతి చెబుతాం....అంటూ సరదాగా వ్యాఖ్యానించి వెళ్లిపోయారు.

Similar News