కాసేపట్లో సిట్ ఎదుటకు ముమైత్ ఖాన్

Update: 2017-07-27 04:14 GMT

టాలివుడ్ నటి ముమైత్ ఖాన్ నేడు సిట్ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. సిట్ విచారణలో ఆమె పాల్గొంటారు. ముమైత్ ఖాన్ ప్రస్తుతం బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా ఉన్నారు. దీంతో ఆమె విచారణకు హాజవుతారా? లేదా? అన్న సందేహాలు నెలకొన్నాయి. అయితే బిగ్ బాస్ షో నిర్వాహకులు ముమైత్ ఖాన్ కు పర్మిషన్ ఇవ్వడంతో ఆమె నిన్న రాత్రే పూణె నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. పూణె వద్ద బిగ్ బాస్ సెట్ ఉండటంతో గత కొద్ది రోజులుగా ముమైత్ అక్కడే ఉంటున్నారు. ముమైత్ పూరి జగన్నాథ్ సినిమాల్లో నటించారు. ఈ డ్రగ్స్ కేసులో ఆమెకూ సంబంధాలున్నాయా? లేక సాక్షిగానే పిలుస్తున్నారా? అన్నది తేలాల్సి ఉంది. ముమైత్ ను కూడా హైకోర్టు సూచనల మేరకు ఈరోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే విచారించనున్నారు.

Similar News