ఓ వైపు లిక్కర్ కోసం కుస్తీలు... మరోవైపు వద్దంటూ ఆందోళనలు

Update: 2017-07-03 02:05 GMT

వైన్‌షాపుల వద్ద మద్యంప్రియులు బారులు తీరి లిక్కర్ కోసం కుస్తీలు పడుతున్న సంఘటన విజయవాడ బందర్ రోడ్డులో చోటుచేసుకుంది. నూతన మద్యం పాలసీతో ప్రస్తుతమున్న బార్లు, మద్యం దుకాణాల లైసెన్సుల గడువు ముగిసింది. లైసెన్స్ పునరుద్ధరణ జాప్యంతో ఒకరోజు నగరంలో మద్యం దుకాణాలు మూతపడ్డాయి. లైసెన్సులు పునరుద్ధరణకావడంతో కొన్ని దుకాణాలు మాత్రమే తెరుచుకున్నాయి. ఆదివారం బందర్ రోడ్డులో కేవలం ఒక్క దుకాణం మాత్రమే తెరవడంతో మద్యంప్రియులు ఎగబడ్డారు. క్యూ కట్టాు. గంటలతరబడి దుకాణం ముందుబారులు తీరి మందు కొనుగోలు చేస్తున్నారు. మిగతా దుకాణాలకు త్వరగా లైసెన్సులు మంజూరు చేస్తేనే తమ కష్టాలు తీరతాయని మందుబాబులు కోరుతున్నారు. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా జనావాసాల మధ్య ఎనికేపాడులో వైన్‌షాపులు ఏర్పాటు చేస్తున్నారని మహిళా సంఘాలు ఆందోళన చేపట్టాయి. వీరికి మహిళా కాంగ్రెస్ మద్దతు తెలిపింది.

Similar News