ఏపీలో బీజేపీ ఓట్ల శాతం తగ్గిందన్న పురంధ్రీశ్వరి

Update: 2017-08-01 13:17 GMT

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఓట్ల శాతం తగ్గిందని బీజేపీ నేత, కేంద్రమంత్రి పురంధ్రీశ్వరి అభిప్రాయపడ్డారు. అందుకు గల కారణాలను మాత్రం ఆమె వివరించలేదు. ఇక బీజేపీ, టీడీపీ పొత్తుపై కూడా పురంద్రీశ్వరి మాట్లాడారు. పొత్తు అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేది కాదని, రెండు పార్టీల మధ్య జరిగేదని, ఏపీలో పొత్తు విషయం అమిత్ షాయే తుదినిర్ణయం తీసుకుంటారని ఆమె చెప్పారు. బీజేపీ కేవలం రాజకీయ లబ్ది కోసం నిర్ణయం తీసుకోదని, సిద్ధాంత ప్రకారం నిర్ణయాలుంటాయన్న పురంధ్రీశ్వరి ఏపీలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు కేంద్రానికి వివరిస్తున్నామని చెప్పారు. బీజేపీ ఏపీలో సొంతంగా బలపడేందుకే ప్రయత్నిస్తుందని చెప్పారు. బూత్ స్థాయి నుంచే పార్టీని బలోపేతం చేసే దిశగా తాము కృషి చేస్తున్నామన్నారు. అలాగే ముద్రగడ విషయంపై కూడా పురంద్రీశ్వరి స్పందించారు. ముద్రగడ పాదయాత్రను అడ్డుకోవడం సబబు కాదన్న పురంధ్రీశ్వరి, అది వ్యక్తి గత స్వేచ్ఛను హరించడమేనన్నారు.మరో వైపు పవన్ కల్యాణ్ ను పురంద్రీశ్వరి పొగిడారు. ఉద్దానం సమస్యపై పవన్ స్పందించిన తీరు బాగుందని కితాబిచ్చారు.

Similar News