ఏపీ కేబినెట్ లో ఆర్కే బీచ్ హైలెట్

Update: 2017-01-25 04:56 GMT

ఏపీ కేబినెట్ మరికాసేపట్లో సమావేశం కానుంది. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన, కర్నూలులో సోలార్ ఫ్యాకర్టీకి భూ కేటాయింపులు వంటి అంశాలపై చర్చ జరగనుంది. మిగిలిన జిల్లాల్లో కూడా పరిశ్రమలకు భూకేటాయింపులపై చర్చ జరగనుంది. జన్మభూమి ఫిర్యాదుల పరిష్కారం, రెంట్ కంట్రోల్ యాక్ట్ బిల్లును తీసుకొచ్చే విషయంపై చర్చ జరగనుంది.

అలాగే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితిపై చర్చించనుంది. ముఖ్యంగా ఈ నెల 26వ తేదీన విశాఖ ఆర్కే బీచ్ లో ప్రత్యేక హోదాపై ఏపీ యూత్ నిరసనకు పిలుపునివ్వడంపై కూడా కేబినెట్ ప్రధానంగా చర్చించనుంది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వరుస ట్వీట్లు, ఆర్కే బీచ్ నిరసనకు మద్దతివ్వడంపైన కూడా సీరియస్ గా సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ముద్రగడ దీక్షపై కూడా భవిష్యత్తులో ఏం చేయాలన్నదానిపై కూడా ముఖ్యమంత్రి మంత్రుల నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు.

కాగా మంత్రివర్గ సమావేశానికి ముందు ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ముఖ్యమంత్రిని, మంత్రివర్గ సభ్యులను కలుసుకోనున్నారు. చరిత్రలో ఒక స్పీకర్ మంత్రివర్గ సమావేశానికి ముందు సచివాలయానికి రావడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. వచ్చే నెలలో జరగనున్న మహిళ పార్లమెంటరేయన్ సదస్సుకు మంత్రులను ఆహ్వానించేందుకే స్పీకర్ సచివాలయానికి వస్తున్నట్లు తెలుస్తోంది.

Similar News