ఉద్ధానం బాధితులకు పింఛన్లు : చంద్రబాబు

Update: 2017-01-06 06:59 GMT

శ్రీకాకుళం జిల్లా ఉద్ధానంలో కిడ్నీలు దెబ్బతిన్నవారికి వికలాంగుల పింఛన్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం ఆయన ఆయాశాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా ఉద్ధానం సమస్యను డాక్టర్ సిఎల్ వెంకట్రావు ప్రస్తావించారు. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ... ఉద్ధానం సమస్యను ఆరోగ్య, పంచాయతీరాజ్ శాఖలు సవాల్‌గా తీసుకోవాలన్నారు. అలాగే ఈ సమస్యపై అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు జరగాల్సి ఉందన్నారు.

యుద్ధప్రాతిపదికన ఉద్దానం సమస్య పరిష్కరించాల్సిన బాధ్యత ఉందని, శాశ్వత పరిష్కారంపై దృష్టిపెట్టాల్సి ఉందని, ఉద్దానంలాంటి సమస్యల పరిష్కారానికి సైన్స్ కాంగ్రెస్ లాంటి సదస్సులు వేదిక కావాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఉద్దానం ప్రజల సమస్యపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇటీవల శ్రీకాకుళం లో పర్యటించారు. ఉద్దానం బాధితుల దీన స్థితిపై ఒక డాక్యుమెంటరీ కూడా విడుదల చేసారు. ఈ అంశం రాజకీయంగా మరింత వివాదం సృష్టించక ముందే బాధితులకు భరోసా కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Similar News