ఈ కరప్షన్ కింగ్ ఆస్తులెంతో తెలుసా?

Update: 2017-03-18 06:30 GMT

విశాఖలో పెద్ద అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. ఒక్కటి కాదు...రెండు కాదు యాభై కోట్ల రూపాయల ఆస్తులను ఇతగాడు సంపాదించాడు. విశాఖ, హైదరాబాద్ లలో పెద్దయెత్తున్న ఆస్తులను కూడ బెట్టాడు. విశాఖలో యూఎల్సీ లో డిప్యూటీ సర్వేయర్ గా పనిచేస్తున్న రాజేశ్వరరావు ఇంటీపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. రాజేశ్వరరావుకు ఉన్న ఆస్తులు, బంగారాన్ని చూసి ఏసీబీ అధికారులే నోళ్లు వెళ్లబెట్టారు. విశాఖలోని ఎన్టీపీసీ, స్టీల్ ప్లాంట్ భూసేకరణలో పెద్దయెత్తున అవినీతికి పాల్పడి రాజేశ్వరరావు అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని నిర్ధారణ అయింది. రాజేశ్వరరావును ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.

50 కోట్లకు పైగా ఆస్తులు...

రాజేశ్వరరావుకు మొత్తం 50 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు విచారణలో వెల్లడయింది. విశాఖలో రెండు ఓపెన్ ప్లాట్లు, రెండు ఫ్లాట్లు, రెండు ఇళ్లు ఉన్నట్లు విచారణలో తేలింది. వీటి విలువ దాదాపు మూడు కోట్లకు పైగానే ఉంటుందని చెబుతున్నారు. ఇవే కాకుండా హైదరాబాద్ లో కూడా ఆస్తులున్నట్లు అధికారులు గుర్తించారు. పది లక్షలు మరో ఇంటికి అడ్వాన్స్ కూడా రాజేశ్వరరావు ఇచ్చాు. మరో పదిలక్షలు డెవలెప్ మెంట్ అడ్వాన్స్ ఇచ్చారు. లాకర్లో 400 గ్రాముల బంగారం దొరికింది. మరో లాకర్ ను ఓపెన్ చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. మూడు కిలోల వెండి, ఒక కారు, రెండు బైకులు ఉన్నాయి. అయితే యువత ఇచ్చిన సమాచారం మేరకే తాము దాడులు చేస్తున్నామని అవినీతి నిరోధక శాఖ అధికారులు చెబుతున్నారు. అవినీతిపై ఇటీవల తమకు యువత నుంచి ఎక్కువగా ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పటం మంచి పరిణామమే. రాజేశ్వరరావు లాంటి అవినీతి ఉద్యోగులకు ఇది షాకింగ్ న్యూస్.

Similar News