ఇద్దరు కేంద్రమంత్రుల రాజీనామా

Update: 2018-03-08 12:36 GMT

కేంద్రమంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరి ప్రధానినరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. తమ రాజీనామా లేఖలను ప్రధానికి సమర్పించారు. కేబినెట్ లో ఉండటంతో ప్రధానిని మర్యాదపూర్వకంగా కలుసుకుని రాజీనామాలు సమర్పించారు. తమ రాజీనామాలకు దారితీసిన పరిస్థితులను వారు వివరించారు. విభజన చట్టంలోని 19 అంశాలను అమలుపర్చక పోవడం, ప్రత్యేక హోదా సాధ్యం కాదని చెప్పడం వల్లనే తాము రాజీనామా చేస్తున్నట్లు వారు ప్రధానికి వివరించినట్లు తెలుస్తోంది. ఏపీలో సెంటిమెంట్ బలంగా ఉండటంతోనే తాము రాజీనామా చేశామని ప్రధానికి వారు వివరించారు. అశోక్ గజపతిరాజు పౌరవిమానయానశాఖ మంత్రిగా ఉన్నారు. అశోక్ గజపతిరాజు 2014 మే 26 న మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సుజనాచౌదరి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా ఉన్నారు. సుజాన చౌదరి 2014 నవంబరు 9న సహాయ మంత్రిగా మోడీ కేబినెట్ లో చేరారు.

Similar News