ఆదర్శ కలెక్టర్ అంటే ఈయనే

Update: 2017-03-18 06:18 GMT

జిల్లాలోని ములుగు ప్రభుత్వ దవాఖానలో శుక్రవారం అరుదైన ఘటన జరిగింది. జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి కూతురు ప్రగతి ప్రభుత్వ దవాఖానాలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రభుత్వం మాతాశిశు సంరక్షణ కోసం ప్రసవాలన్నీ ప్రభుత్వ దవాఖానల్లోనే జరిగేలా చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. కేసీఆర్ అమ్మఒడి పథకంలో భాగంగా బాలింతకు రూ.12 వేలు ఆర్థికసాయం అందించే పథకాన్ని ప్రభుత్వం ఏప్రిల్ నుంచి అమలుచేయనున్నది.

మొదటి నుంచి ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు జరిగేలా దృష్టిపెట్టిన కలెక్టర్ మురళి, తన కూతురిని సైతం ప్రసవం కోసం ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లి ఆదర్శంగా నిలిచారు.శుక్రవారం ములుగు దవాఖానాలో ప్రగతికి సాధారణ ప్రసవం సాధ్యం కాకపోవడంతో ఆరుగురు వైద్యుల బృందం మధ్యాహ్నం 3:30 గంటలకు శస్త్రచికిత్స చేయగా ఆడశిశువు జన్మించింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉండటంపై కలెక్టర్ ఆకునూరి మురళి సంతోషం వ్యక్తంచేశారు.

Similar News