ఆంధ్రాకు అన్యాయం చేయట్లేదన్న కేంద్రం

Update: 2017-07-27 03:50 GMT

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ రైల్వే ప్రాజెక్టుల్లో 284శాతం వృద్ధి నమోదైందని రైల్వే శాఖ పార్లమెంటులో ప్రకటించింది. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు అడిగిన ప్రశ్నలకు రైల్వే శాఖ సమాధానం ఇచ్చింది. ఏపీలో రూ.44,243.59కోట్ల విలువైన 31 పనులు జరుగుతున్నట్లు ప్రకటించారు. ప్రాజెక్టులన్ని వివిధ దశల్లో ఉన్నాయని., కొత్త లైన్ల నిర్మాణం., డబ్లింగ్‌ ప్రాజెక్టులకు రూ.2,646.50 కోట్లు కేటాయింపులు చేశారు. గుంటూరు మీదుగా విజయవాడ-అమరావతి మద్య 106కి.మీల కొత్త లైన్‌ నిర్మాణానికి రూ.2,679కోట్లు కేటాయించారు. 2014-16 మధ్య కాలంలో ఏపీకి సగటున రూ.2195.70కోట్లు కేటాయించారు. 2009-13 మధ్య కాలంలో ఈ సగటు కేవలం 886.40 కోట్లు మాత్రమే రైల్వే మంత్రి పార్లమెంటుకు తెలిపారు. 2017-18 బడ్జెట్‌లో అత్యధికంగా 3,406కోట్ల కేటాయింపులు జరిగాయని., ఇది 2009-14 మధ్య కాలంలో ఇచ్చిన కేటాయింపు కన్నా 284శాతం అధికమని ప్రకటించారు.

Similar News