అసద్ కు ఊహించని షాక్...!

Update: 2017-10-26 05:58 GMT

హైదరాబాద్ లో మజ్లిస్ టార్గెట్ అయింది. గతంలో ఎన్నడూ ఈ పరిణామాలు ఆ పార్టీ వినేలేదు. కనలేదు. మజ్లిస్ పార్టీతో అనుంబంధమున్న వారి ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతుండటంతో పాతబస్తీలో కలకలం రేగింది. మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రధాన అనుచరుడు షానవాజ్ హుస్సేన్ నివాసాలపై ఈరోజు ఐటీ దాడులు జరిగాయి. హుస్సేన్ నివాసాలైన శాస్త్రిపురం, ఇంజన్ బౌలి, ఛార్మినార్ వద్ద ఈ దాడులు జరుగుతున్నాయి. అలాగే అసద్ కు అత్యంత సన్నిహితుడైన ఒబైద్ ఇంటిపైన కూడా దాడులు కొనసాగుతున్నాయి. టోలిచౌకిలోని మజ్లిస్ కార్యకర్త అఖ్తర్ ఇళ్లపైనా దాడులు జరిగాయి.

ఇదే తొలిసారి.....

మజ్లిస్ పార్టీ పుట్టిన తర్వాత ఇలా ఐటీ దాడులు జరగడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. పెద్దయెత్తున ఆదాయానికి మించిన ఆస్తులు ఈదాడుల్లో బయటపడినట్లు తెలుస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణలోని హైదరాబాద్ లో పట్టుకోసమే ఈ దాడులు కమలం పార్టీ చేస్తున్నట్లు మజ్లిస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై అసద్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. మజ్లిస్ ను అణిచి వేసేందుకే కుట్రపూరిత దాడులు జరుగుతున్నాయని, సంయమనం పాటించాలని అసద్ అనుచరులను కోరారు. ఈ దాడులకు సంబంధించిన విషయాన్ని అధికారులు అత్యంత గోప్యంగా ఉంచడం విశేషం.

Similar News