అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం

Update: 2017-01-20 17:20 GMT

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా 45వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం చేశారు. ట్రంప్ రెండు బైబుళ్ల మీద చేతులు ఉంచి ప్రమాణ స్వీకారం చేశారు. ఒక బైబిల్ తన తల్లి బహుకరించింది కాగా, రెండోది 150 ఏళ్ల క్రితం అబ్రహాం లింకన్ ప్రమాణ స్వీకారం చేసిన బైబిల్ నే ట్రంప్ ఉపయోగించడం విశేషం. వాషింగ్టన్ డీసీలోని కేపిటల్ బిల్డింగ్ వద్ద అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ట్రంప్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, క్లింటన్, జార్జి బుష్ లు హాజరయ్యారు. భారత కాలమాన ప్రకారం శుక్రవారం రాత్రి 10.30గంటలకు ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు.

Similar News