అడ్డదారిలో కిలోల కొద్దీ గోల్డ్

Update: 2017-03-24 02:46 GMT

శంషాబాద్ ఎయిర్ పోర్టు గోల్డ్ మాఫియాకు అడ్డాగా మారింది. అరబ్ దేశాల నుంచి ఇక్కడ బంగారం స్మగ్లింగ్ చేసే ముఠాలు పెరిగి పోతున్నాయి. బంగారం రేటు పెరిగిన ప్రతిసారీ ఈ గోల్డ్ మాఫియా హైదరాబాద్ కు పెద్ద మొత్తంలో బంగారం స్మగ్లింగ్ చేస్తుంటుంది. వివిధ రూపాల్లో హైదరాబాద్ కు బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తుంటుంది ఈ మాఫియా..ఈ గోల్డ్ మాఫియాను కట్టడి చేసేందుకు కస్టమ్స్ తో పాటుగా డిఆర్ ఐలు ఎన్ని ప్రయత్నాలు చేసినా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వారంలో రెండు నుంచి ఐదు కిలో ల బంగారం వస్తునే వుంటుంది. తాజాగా ఒక వ్యక్తి తన జీన్ ప్యాంట్ లోని ప్రత్యేకమైన జేబులను కుట్టించుకుని వాటిలో తొమ్మది బంగారం కడ్డీలను పెట్టుకుని ఎయిర్ పొర్టులో దిగారు. జీన్ ప్యాంట్ లో కొన్ని చోట్ల ఈ ప్రత్యేక మైన జేబులను ఏర్పాటు చేసుకున్నారు. అయితే కస్టమ్స్ అధికారులు చెక్ చేసినప్పడు ఇవి ఎట్టి పరిస్దితిలో కూడా కనపడవు.అయితే బాడీ స్కానర్ ద్వారా ఈ చెకింగ్ చేసినప్పుడు ఈ బంగారం కడ్డీలు బయట పడ్డాయి. దీంతో దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తి ని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని తొమ్మిది వందల గ్రాముల బంగారం కడ్డీలను స్వాధీన పరుచుకున్నారు.

Similar News