అజ్ఞాతంలో లేనన్న వనితారెడ్డి

Update: 2017-12-27 11:53 GMT

సినీనటుడు విజయసాయి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితురాలిగా భావిస్తున్న వనితారెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోయారు. తన వల్ల విజయ్ సాయి ఆత్మ హత్య చేసుకోలేదన్నారు. తాము విడిపోయి మూడేళ్లవుతుందని, తాను అతనినుంచి విడాకుల కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. విజయ్ సాయి వల్ల తాను ఎంత టార్చర్ భరించానో సాక్ష్యాలను పోలీసులకు ఇచ్చానని వనితారెడ్డి తెలిపారు. తాను విజయ్ సాయిని ఎప్పుడూ బెదిరించలేదని, విజయ్ తల్లిదండ్రులు తన కొడుకు తప్పులను కప్పిపుచ్చుకోవడానికే బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. తాను ఎప్పుడూ విజయ్ మీద పగ సాధించుకోవాలనుకోలేదన్నారు. తాను ఎప్పుడూ విజయ్ సాయితో మాట్లాడలేదని, ఆ ఆడియో టేపులన్నీ పాతవని వనితారెడ్డి కొట్టిపారేశారు. తాను ఇన్నాళ్లూ అజ్ఞాతంలో లేనని, ఇన్నాళ్లూ విజయ్ ఆత్మహత్యకు సంబంధం లేదని నిరూపించడానికి సాక్ష్యాలు సేకరించడానికే విజయవాడ, కాకినాడ వెళ్లానన్నారు. మూడేళ్ల నుంచి తాను అతనితో మాట్లాడలేదన్నారు.

Similar News