రాజధాని అంటే నగరాన్ని నిర్మించడమా?

రాజధాని అంటే నగరాలను నిర్మించడం కాదని చంద్రబాబు, పవన్ కల్యాణ్ తెలుసుకోవలన్నారు వైసీపీ అధినేత అంబటి రాంబాబు. దేశంలో ఎక్కడా రాజధాని నగరం నిర్మాణం జరగలేదన్నారు. మౌలిక [more]

Update: 2019-12-19 07:01 GMT

రాజధాని అంటే నగరాలను నిర్మించడం కాదని చంద్రబాబు, పవన్ కల్యాణ్ తెలుసుకోవలన్నారు వైసీపీ అధినేత అంబటి రాంబాబు. దేశంలో ఎక్కడా రాజధాని నగరం నిర్మాణం జరగలేదన్నారు. మౌలిక సదుపాయాలున్న నగరంలో అసెంబ్లీ, సెక్రటేరియట్ లు నిర్మించడం జరుగుతుందన్నారు. మూడు రాజధానులంటే మూడు నగరాలను నిర్మించడం కాదని అంబటి రాంబాబు తెలిపారు. జగన్ ప్రకటనపై అన్ని ప్రాంతాల నుంచి హర్షం వ్యక్తమవుతుందన్నారు. కేంద్రీకృత అభివృద్ధి వల్ల నష్టం జరిగిందన్నారు. అమరావతి అనేది ఒక కుంభకోణమని అంబటి రాంబాబు తెలిపారు. రాజధాని నగరం నిర్మాణం పేరుతో లక్షల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. అందుకే అభివృద్ధిని వికేంద్రీకరించాలని జగన్ నిర్ణయించారన్నారు.

బినామీలు కలసి…..

చంద్రబాబు, బినామీలు కలసి నాలుగువేల ఎకరాలు రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారన్నారు. అమరావతిని మీ సంపద సృష్టి కోసమే నిర్మించదలుచుకున్నారన్నారు. రైతులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రైతులు కొందరు వ్యక్తిగత దూషణలకు దిగితే సహించేది లేదని అంబటి రాంబాబు హెచ్చరించారు. అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలని మాత్రమే ప్రభుత్వ ఉద్దేశ్యమని అంబటి రాంబాబు తెలిపారు. కొందరు ఆందోళన పేరుతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు ఊహారాజధానిలో విహరించిన వారికి కొంత బాధ కలిగించవచ్చునేమో కాని ఐదు కోట్ల మందికి న్యాయం జరుగుతుందని అంబటి రాంబాబు తెలిపారు. తాము కక్ష పూరిత రాజకీయాలు చేయడం లేదన్నారు.

Tags:    

Similar News