హత్యకు గల కారణాలు మాత్రం?

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగంగా జరుగుతుంది. ఉమాశంకర్ రెడ్డి అరెస్ట్ తో మరిన్ని పేర్లు బయటకు వచ్చే అవకాశాలున్నాయి. ఉమాశంకర్ రెడ్డిని ఈ [more]

Update: 2021-09-11 03:04 GMT

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగంగా జరుగుతుంది. ఉమాశంకర్ రెడ్డి అరెస్ట్ తో మరిన్ని పేర్లు బయటకు వచ్చే అవకాశాలున్నాయి. ఉమాశంకర్ రెడ్డిని ఈ కేసులో అరెస్ట్ చేయడంతో కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. కడప జిల్లాకు చెందిన ఉమాశంకర్ రెడ్డి ప్రధాన నిందితుడిగా భావిస్తున్నారు. ఉమాశంకర్ రెడడ్ి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి భూములు చూసుకునే వారు. ఇప్పటికే అరెస్ట్ అయిన సునీల్ కుమార్ యాదవ్ ఇచ్చిన సమాచారం మేరకు ఉమాశంకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరికొందరి పేర్లు బయటకు వచ్చే అవకాశముంది. అయితే నిందితులు ఎవరో గుర్తించిన సీబీఐ అధికారులు హత్యకు గల కారణాలను మాత్రం ఇంతవరకూ తెలుసుకోలేకపోయారు.

Tags:    

Similar News