వివేకా ఇంటి పరిసర ప్రాంతాల్లో?

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగంగా సాగుతుంది. వివేకానందరెడ్డి మాజీ డ్రైవర్ దస్తగిరిని మరోసారి సీబీఐ అధికారులు ప్రశ్నించారు. సీబీఐకి చెందిన [more]

Update: 2021-08-03 02:50 GMT

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగంగా సాగుతుంది. వివేకానందరెడ్డి మాజీ డ్రైవర్ దస్తగిరిని మరోసారి సీబీఐ అధికారులు ప్రశ్నించారు. సీబీఐకి చెందిన రెండు బృందాలు విచారణ చేపట్టాయి. పులివెందులలోనే విచారణ చేస్తున్నాయి. వివేకానందరెడ్డి ఇంటి పరిసరాలను కూడా సీబీఐ బృందం పరిశీలించింది. వివేకానందరెడ్డి ఇంటి నుంచి ఆటో మొబైల్ దుకాణం వరకూ సీబీఐ అధికారులు కొలతలు తీసుకున్నారు. వివేకానందరెడ్డి ఇంటి రోడ్డు మార్గంలో అన్ని వైపుల కొలతలను వేసి సర్వేయర్ ద్వారా రికార్డు చేశఆరు. హత్య జరిగిన రోజు ఈ ప్రాంతానికి నిందితులు రాకపోకలపై ఆరా తీశారు. ఈరోజు కూడా మరికొందరు అనుమానితులను సీబీఐ అధికారులు విచారించనున్నారు.

Tags:    

Similar News