వైఎస్ షర్మిల దీక్ష విరమణ

వైఎస్ షర్మిల దీక్ష ను విరమించారు. మూడు రోజులుగా షర్మిల దీక్ష చేస్తున్నారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై వైఎస్ షర్మిల దీక్ష చేపట్టారు. తొలిరోజు ఇందిరాపార్క్ వద్ద [more]

Update: 2021-04-18 06:22 GMT

వైఎస్ షర్మిల దీక్ష ను విరమించారు. మూడు రోజులుగా షర్మిల దీక్ష చేస్తున్నారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై వైఎస్ షర్మిల దీక్ష చేపట్టారు. తొలిరోజు ఇందిరాపార్క్ వద్ద దీక్ష చేసిన వైఎస్ షర్మిల తర్వాత లోటస్ పాండ్ లోనే దీక్ష చేస్తున్నారు. ఈనెల 15వ తేదీ నుంచి వైఎస్ షర్మిల దీక్ష చేస్తున్నారు. వైఎస్ షర్మిల చేత అమరవీరుల కుటుంబ సభ్యులు నిమ్మరసం తాగించి దీక్షను విరమింప చేశారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ నిరుద్యోగుల పక్షాన తాను అక్కగా అండగా ఉంటానని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో విఫమయిందని వైఎస్ షర్మిల ఆరోపించారు.

Tags:    

Similar News