ఇద్దరి ముఖ్యమంత్రులదీ దొంగాట

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లవుతున్నా పేదల బతుకులు మారలేదని వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఆమె ప్రకటించారు. ఉపాధి కల్పించని లక్షల బడ్జెట్ ఎవరి [more]

Update: 2021-07-08 13:35 GMT

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లవుతున్నా పేదల బతుకులు మారలేదని వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఆమె ప్రకటించారు. ఉపాధి కల్పించని లక్షల బడ్జెట్ ఎవరి కోసమని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో నిరుద్యోగుల జీవితాలు మారలేదని అన్నారు. పేదరికం ఇంకా తెలంగాణలో పోలేదన్నారు. ఇంకా రేషన్ సరుకుల కోసం క్యూ కట్టడమేనా? అని ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యలు కేసీఆర్ సంక్షేమ పాలనకు నిదర్శనమా అని వైఎస్ షర్మిల నిలదీశారు. వైఎస్సార్ సంక్షేమ పాలనను మళ్లీ తెలంగాణలో తీసుకొస్తామని ఆమె మాట ఇచ్చారు. పేదలను ఆదుకుందామన్న మనసు కేసీఆర్ కు లేదన్నారు. తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టి తన కుటుంబంలో మాత్రం నాలుగు ఉద్యోగులు ఇచ్చుకున్నారన్నారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ పచ్చి మోసగాడు అని వైఎస్ షర్మిల మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో ఏ ఒక్కవర్గమూ సంతోషంగా లేదన్నారు. రైతులకు సరైన గిట్టుబాటు ధర లేదన్నారు. నిరుద్యోగులకు నోటిపికేషన్లు లేవన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎందుకు కలసి కూర్చుని నీటి వివాదాలపై చర్చించడం లేదని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఇద్దరూ కూర్చుని కలసి భోజనాలు చేస్తారు కాని, సమస్యలపై చర్చించడానికి తీరికలేదా? అని ప్రశ్నించారు. లేక చేతకాదా అని షర్మిల నిలదీశారు. ఇద్దరు ముఖ్యమంత్రులు శత్రువును ఓడించడానికి మాత్రం ఒక్కటవుతారని షర్మిల అన్నారు మరో వందరోజుల్లో తెలంగాణాలో తాను పాదయాత్ర చేస్తానని షర్మిల ప్రకటించారు.

Tags:    

Similar News