ఆరోగ్య శ్రీని మరింత విస్తరిస్తున్నాం

ఆరోగ్య శ్రీ పరిధిని మరింత విస్తృతం చేస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. వెయ్యి రూపాయలు వైద్యం ఖర్చు దాటితే అది ఆరోగ్య శ్రీ పథకం [more]

Update: 2020-07-16 06:45 GMT

ఆరోగ్య శ్రీ పరిధిని మరింత విస్తృతం చేస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. వెయ్యి రూపాయలు వైద్యం ఖర్చు దాటితే అది ఆరోగ్య శ్రీ పథకం కింద వస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో మరో ఆరు జిల్లాలకు ఆరోగ్య శ్రీ పరిధిని విస్తరిస్తున్నామని జగన్ తెలిపారు. ఆరోగ్యశ్రీ చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం ఉండదని జగన్ చెప్పారు. ఆరోగ్య రంగంలో పూర్తి మార్పులు చేస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య సమాచారాన్ని సర్వర్ లో భద్రపరుస్తామని చెప్పారు. వైద్యం కోసం నిరుపేదలు ఎవరూ ఇబ్బంది పడకూడదన్నారు. కడప, కర్నూలు, ప్రకాశం, విజయనగరం, గుంటూరు, విశాఖ జిల్లాలకు ఆరోగ్యశ్రీని విస్తరిస్తున్నట్లు జగన్ తెలిపారు. ఏప్రిల్ నెల చివరి నాటికి పదమూడు వేల విలేజ్ క్లినిక్ లను అందుబాటులోకి తీసుకు వస్తామని చెప్పారు. నాడు నేడు కార్యక్రమంతో ఆసుపత్రుల రూపు రేఖలను మార్చనున్నట్లు జగన్ తెలిపారు. నెట్ వర్కింగ్ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలను అందిస్తామని జగన్ చెప్పారు. 2,200 వ్యాధులను ఆరోగ్యశ్రీ కింద చేర్చినట్లు జగన్ తెలిపారు.

Tags:    

Similar News