దురదృష్ట సంఘటనగా చూడండి… ఎవరికీ ఆపాదించకండి

కరోనా కాటుకు కులాలు, మతాలు ఉండవని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఏ ఆధ్యాత్మిక కేంద్రంలోనైనా ఇలాంటి సంఘటనలు జరగవచ్చాన్నారు. ఢిల్లీలో జరిగిన ఒక సమావేశానికి [more]

Update: 2020-04-04 11:53 GMT

కరోనా కాటుకు కులాలు, మతాలు ఉండవని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఏ ఆధ్యాత్మిక కేంద్రంలోనైనా ఇలాంటి సంఘటనలు జరగవచ్చాన్నారు. ఢిల్లీలో జరిగిన ఒక సమావేశానికి విదేశీ ప్రతినిధులు వచ్చారని, వారి నుంచి కరోనా వ్యాప్తిచెందిందన్నారు. దీనిని దురదృష్ట సంఘటనగా చూడాలి తప్ప, దీనిని ఒక కులానికో, మతానికో ఆపాదించకూడదని జగన్ అభిప్రాయపడ్డారు. భారతీయులంతా ఒక్కటిగా ఉన్నామని చాటి చెప్పాలన్నారు. దురదృష్టవశాత్తూ జరిగిన ఈ ఘటనను వాడుకునే ప్రయత్నం చేయవద్దన్నారు. మనదేశంలోనూ అనేకమంది ఆధ్మాత్మికవేత్తలున్నారుని, వారి సభల్లోనూ ఇలాంటి సంఘటన జరగవచ్చన్నారు. రేపు సాయంత్రం 9గంటలకు అందరూ విద్యుత్తును నిలిపివేసి దీపాలను వెలిగించాలన్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుకు అందరం స్పందించాలని కోరారు. భౌతిక దూరం పాటిస్తూ కరోనాను తరిమికొడదామని పిలుపునిచ్చారు. జగన్ కొద్దిసేపటి క్రితం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

Tags:    

Similar News