లాక్ డౌన్ పై జగన్ సీరియస్.. నిర్ణయంలో మార్పు

లాక్ డౌన్ కు ప్రజలు సహకరించకపోవడంపై జగన్ సీరియస్ అయినట్లు తెలిసింది. ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో ఉదయం 6గంటల నుంచి [more]

Update: 2020-03-29 08:06 GMT

లాక్ డౌన్ కు ప్రజలు సహకరించకపోవడంపై జగన్ సీరియస్ అయినట్లు తెలిసింది. ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ నిత్యావసర వస్తువుల ధరల కొనుగోలుకు ప్రజలు బయటకు వచ్చేందుకు అనుమతిచ్చారు. అయితే ఈ సమయంలో పెద్దయెత్తున ప్రజలు రోడ్డు మీదకు వస్తుండటతో ఇప్పుడు ఆ సమయాన్ని 11గంటలవరకే పరిమితం చేశారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకే ప్రజలకు రోడ్డు మీదకు అనుమతిస్తున్నట్లు మంత్రి ఆళ్ల నాని తెలిపారు. అలాగే నిత్యావసర వస్తువుల ధరలు వ్యాపారులు బయట బోర్డు పెట్టాలని, రేట్లు పెంచితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిత్యావసర వస్తువుల కొరత లేకుండా చేస్తామని చెప్పారు.

Tags:    

Similar News