గంటన్నర పాటు భేటీలో?

ప్రధాని నరేంద్ర మోడీతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ దాదాపు గంటన్నర సేపు సమావేశమయ్యారు. ప్రత్యేక హోదాతో పాటు పలు విషయాలను ముఖ్యమంత్రి జగన్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. [more]

Update: 2020-02-12 15:19 GMT

ప్రధాని నరేంద్ర మోడీతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ దాదాపు గంటన్నర సేపు సమావేశమయ్యారు. ప్రత్యేక హోదాతో పాటు పలు విషయాలను ముఖ్యమంత్రి జగన్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలు 55, 549 కోట్లకు పరిపాలన అనుమతులు ఇవ్వాలని జగన్ ఈ సందర్భంగా ప్రధానిని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఖర్చు చేసిన 3,320 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు.

ప్రధానికి ఆహ్వానం……

మార్చి 25వ తేదీన 25 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నామని, ఆ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా జగన్ ప్రధానిని కోరారు. అలాగే రెవెన్యూ లోటును కూడా భర్తీ చేయాలని తెలిపారు. కడప జిల్లా స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి కూడా నిధులు ఇవ్వాలని కోరారు. హైకోర్ఠును కర్నూలుకు తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రధానిని జగన్ కోరారు. ప్రధానితో సమావేశం సానుకూలంగా జరిగిందని, త్వరలోనే రాష్ట్ర సమస్యలు పరిష్కారం అవుతాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News