అడ్డం తిరిగిన ఈడీ

ముఖ్యమంత్రి హోదాలో మొట్టమెదటి సారిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీబీఐ కోర్టు కు హాజరైయ్యారు. ఆస్తుల కేసు వ్యవహారంలో కోర్టు ఆదేశాల మేరకు జగన్ [more]

Update: 2020-01-10 12:13 GMT

ముఖ్యమంత్రి హోదాలో మొట్టమెదటి సారిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీబీఐ కోర్టు కు హాజరైయ్యారు. ఆస్తుల కేసు వ్యవహారంలో కోర్టు ఆదేశాల మేరకు జగన్ నేడు ప్రత్యేక్షంగా న్యాయమూర్తి ఎదుట విచారణ కు హజరయ్యారు జగన్ పై ఆస్తుల కేసులో డిశ్చార్జ్ పిటిషన్లు కలిపి అన్ని ఒకేసారి విచారించాలని గతంలో జగన్ ధాఖలు చేసిన పిటిషన్ పైనే శుక్రవారం విచారణ చేపట్టిన కోర్టు తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.

కోర్టుకు హాజరు కావడంతో….

ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వ్యక్తిగత హజరుకు మినహాయింపు ఇవ్వలేమని సిబిఐ కోర్టు గతంలో స్పష్టం చేసింది. తదుపరి విచారణకు ఖచ్చితంగా కోర్టుకు హజరు కావాలని సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ముఖ్యమంత్రి హోదాలో మొట్ట మొదటిసారిగా జగన్ సీబీఐ కోర్టుకు హజరయ్యారు,గన్ తో పాటు ఈ కేసులో ఎ-2 గా ఉన్న రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మీ, బిసిసిఐ మాజీ డైరెక్టర్ శ్రీనివాసన్ లు ప్రత్యేక్షంగా నేడు కోర్టుకు హాజరయ్యారు.. సిబిఐ కోర్టుకు జగన్ హాజరవుతండండంతో తెలంగాణ పోలీసలు ఏపీ ప్రభుత్వం అభ్యర్ధన మేరకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

ప్రతి ఛార్జి షీటులో….

ఆస్తుల కేసు వ్యవహారంలో జగన్ పై 11 చార్జ్ షీట్లను సీబీఐ అధికారులు కోర్టు లో ధాఖలు చేశారు. ప్రతి చార్జ్ షీట్ లో ఏ-1 నిందితుడిగా జగన్ పేరు నమోదు చేశారు. ఇక ఎ-2 గా విజయసాయి రెడ్డి ఉన్నారు.11 చార్జ్ షీట్లలో 2 చార్జ్ ఫీట్లపైనా గతంలో హైకోర్టు స్టే విధించింది. మిగిలిన చార్జ్ షీట్ లపై ప్రస్తుతం సీబీఐ కోర్టు విచారణ జరుపుతుంది. జగన్ అన్ని కేసులలో డిశ్చార్జ్ పిటిషన్లను కలిపి విచారించాలని గతంలో జగన్ వేసిన పిటిషన్ పైన నేడు కోర్టు మరోసారి విచారణ చేపట్టింది.. దాదాపు 2 గంటల పాటు విచారించిన కోర్టు తదుపరి విచారణ ను ఈ నెల 17 కు వాయిదా వేసింది.

సబిత, ధర్మానలకు నోటీసులు….

ఇక మరోవైపు పెన్నా సిమెంట్ అనుబంధ చార్జిషీట్ విచారణ చేపట్టిన సిబిఐ కోర్టు పలువురు నేతలకు, అధికారులకు నోటీసులు జారీ చేసింది.. ఈ కేసులో మంత్రి సబితా కు మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ తో పాటు ఐఏఎస్ అధికారిని శ్రీ లక్ష్మీ, రిటైర్డ్ అధికారులు శ్యాముల్, రాజగోపాల్ లకు సమన్లు జారీ చేసింది. వీరితో పాటు కేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్న డిఆర్వో సుదర్శన్ రెడ్డి, తహశీల్దార్ ఎల్లమ్మ కు సైతం సమన్లు జారీ చేసింది.. పెన్నా సిమెంట్స్ కేసులో ఈ నెల 17న విచారణకు హజరుకావాలని నోటీసులు జారీ చేసింది. ఇక మరోవైపు అనుబంధ చార్జ్ షీట్ల ను పరిగణించ వద్దన్న జగన్ కోర్టును కోరారు. ఇతర నిందితుల వాదనలను సీబీఐ కోర్టు తోసిపుచ్చింది.

వ్యక్తిగత హాజరు నుంచి…..

ఈడీ కేసులో ను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి జగన్ కోర్టులో పిటిషన్ ధాఖలయింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా ఉన్న నేపథ్యంలో ఈడీ కేసులో హాజరు కాలేనని మినహాయింపు ఇవ్వాలని జగన్ కోర్టును కోరారు.. ఇక మరోవైపు జగన్ అభ్యర్ధన పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అభ్యంతరం వ్యక్తం చేసింది.. ఆర్ధిక పరమైన నేరాల్లో ఉన్న నిందితులకు మినహాయింపు ఇవ్వొద్దని ఈడీ కోర్టుకు తెలిపింది. ఇరు వాదనలు విన్న కోర్టు తీర్పునుఈ నెల 24 కు వాయిదా వేసింది.

Tags:    

Similar News