వారికి గుడ్ న్యూస్ చెప్పిన జగన్

రేషన్ పంపిణీ చేసే వాహనదారులకు ముఖ్యమంత్రి జగన్ శుభవార్త చెప్పారు. వారి ఆదాయాన్ని పెంచుతూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. తమకు ఆదాయం రావడం లేదని, తమకు అన్ని [more]

Update: 2021-02-06 01:14 GMT

రేషన్ పంపిణీ చేసే వాహనదారులకు ముఖ్యమంత్రి జగన్ శుభవార్త చెప్పారు. వారి ఆదాయాన్ని పెంచుతూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. తమకు ఆదాయం రావడం లేదని, తమకు అన్ని పనులను అప్పజెప్పడంతో తాము రేషన్ ను ఇంటింటికి చేర్చలేమని పలుచోట్ల రేషన్ వాహనదారులు ఆందోళనకు దిగారు. దీంతో ప్రభుత్వం ఒక్కొక్క వాహనానికి అద్దె కింద పదివేల నుంచి పదమూడు వేలకు పెంచింది. అలాగే వాహనంలో ఉండే సహాయకుడికి మూడు వేల నుంచి ఐదు వేలకు పెంచింది. దీంతో ఇంటింటికి రేషన్ పంపిణీ చేసే మొబైల్ వాహన యజమానికి ఐదు వేలు అదనపు ఆదాయం సమకూరుతుంది. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Tags:    

Similar News